జగిత్యాల,అగ్నిధారన్యూస్: పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం – జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం రోజున జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ జిల్లాప్రజాపరిషత్ కార్యాలయంలోజిల్లా,డివిజనల్, మండల,సాయి అధికారులతోసమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ,కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రజల్లో అవగాహనకల్పించాలని. కరోనా నిబంధనలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకొని, anm ఆశా వర్కర్లు మరియు వైద్య సిబ్బంది అందరూ కలిసికట్టుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జిల్లా ప్రజలందరికీ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలన్నారు.ప్రతిపల్లె పచ్చగా,పల్లె ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హరితహారం, స్వచ్ఛ సర్వేక్షన్ మరియు పరిశుభ్రత వంటి కార్యక్రమాల వలె పల్లె ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ,అందించాలని అన్నారు. ప్రజల అందరూ ఆరోగ్యంగా ఉండడమే సీఎం ఆకాంక్ష, అన్నారు.దానికి అనుగుణంగా జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో శానిటేషన్ మరియు మొక్కల సంరక్షణ కార్యక్రమాలు నిరంతరం జరగాలి అని అధికారులను ఆదేశించారు. అభివృద్ధిపథకాలు అన్నీ ప్రజలకు అందేలా చూడాలని, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలన్నారు.జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా ముందు వరుసలో ఉండేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు కలిసి పనిచేయాలన్నారు.
ఈకార్యక్రమంలోDRDOవినోద్ కుమార్,DPOహరికిరణ్ జడ్పీ సీఈఓ సుందర్ వరధారాజన్, జగిత్యాల &మెట్ పెల్లి DLPO శ్రీనివాస్,కోరుట్లDLPOశంకర్,ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
