జగిత్యాల,అగ్నిధారన్యూస్: గురువారం రోజు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలో పట్టణప్రగతిలోభాగంగపట్టణప్రగతినిధులు,12లక్షలతో స్థానిక SKNR డిగ్రీ కాలేజి వద్ద  వ్యాయామశాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయనమాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఫిట్ నెస్ తో ఉండాలని అన్నారు చలికాలం వ్యాయామానికి అనువైన సమయం అన్నారు. ప్రభుత్వం ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిపిస్తునే, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని వ్యాయామశాలను ఏర్పాటుచేశామన్నారు. ప్రజల ఆరోగ్యమే మహభాగ్యము అనే సంకల్పంతో ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందుకు వెళ్తున్నారు, అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,స్థానిక కౌన్సిలర్ తోట మల్లికార్జున్, కమిషనర్ స్వరూప రాణి,కౌన్సిలర్లు కుసరి అనిల్,  రాజేష్, కప్పల శ్రీకాంత్,నాయకులు డా.భోగ ప్రవీణ్, కూతురు శేఖర్,యూత్ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి శరత్ రావ్, AMC డైరెక్టర్ బండారి విజయ్, డి.ఈ రాజేశ్వర్ రావు, ఏ.ఈ శరణ్ తేజ, FRO, కళాశాల ప్రిన్సిపాల్, sknr వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.