పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:బుధవారంరోజునపెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు ఈర్ల కొమురయ్య.పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి 7వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకార్మికుల శ్రేయస్సు కోసం దేశంలోనే మొదటిసారిగా ఫ్రావిడెంట్ ఫౌండ్ ను అమలు లోకి తీసుకవచ్చిన కార్మిక నాయకుడు స్వర్గీయ కాకా వెంకటస్వామి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి కాకా చేసిన సేవలను గుర్తు చేశారు.కాకా నిరుపేదలకు చేసిన సేవలు చిరకాలం నిలిచిపోతాయని, ఆయన లేనిలోటు తీర్చలేనిదని పేద ప్రజల హృదయాల్లో చిరకాలం ఉంటారని అన్నారు.పేదలకు గుడిసెలు ఇచ్చి గుడిసెల వెంకటస్వామిగా పేరు గాంచిన కార్మిక నేత అని అన్నారు .ఈ కార్యక్రమంలో ఎండి సర్వర్,నల్లగొండ కుమార్,ఎమ్,రవీందర్, వేముల రాజు,బొడ్డుపల్లి తిరుపతి,గులబ్,కనకయ్య, వెంకటేష్, కొమ్ము అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
