పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వెనకాల21వార్డు సాగర్ రోడ్ లో గల, శ్రీ సరస్వతిశిశుమందిర్పాఠశాలఆచారవ్యవహారాలకు  సాంప్రదాయాలకు, సంస్కృతులను, విద్యార్థిని, విద్యార్థులకు, దేశభక్తిని పెంపొందించడంలో శ్రీ సరస్వతి శిశు మందిరాలు ఉన్నత స్థానంలో ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి స్కూల్లో గత ఐదారు సంవత్సరాలుగా క్లాస్ రూములు కంపు కొడుతున్నాయ్ ,ఒక దిక్కు పచ్చదనంతో మరో దిక్కు చెత్తదనంతో పాఠశాలలో విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు.  ఈ పాఠశాల పక్కనే తరగతి గదులని అనుకొని మునిసిపల్( మోరి)కాలువ ఉంటుందిఈమురుగు కాలువలు శుభ్రంచేయక ఏళ్లుగడుస్తున్నాయి. చెప్పిన,పట్టించుకునేవారు, లేరు. నిత్యం దుర్గంధంతో తరగతి గదిలోని విద్యార్థులు, అధ్యాపకులు,  ఇబ్బందిపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం శూన్యం. ఈ పాఠశాల వెనకాల గల మోరిలో పందులు నిత్యం స్వైర విహారం చేస్తుంటాయి.చెత్తా చెదారం ప్లాస్టిక్ కవర్ల తో ఆ ప్రాంతమంతా కలుషితమై ఉంటుంది. అయినా మున్సిపల్ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోరు. కానీ నిత్యం విద్యార్థులకు అధ్యాపకులకు క్లాసు రూములో కంపు వాసన తప్పదు పట్టణ ప్రగతి పచ్చదనం  ప్రజోపకార ,కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం  ముందుకు వెళుతున్న తరుణంలో పెద్దపల్లిలో  మున్సిపల్ అధికారులు ఈ చెత్తదనాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు వారికే తెలియాలి. స్థానిక కౌన్సిలర్ కి విషయం తెలుసా?,తెలిసిన ఎందుకు పట్టించుకోవడం లేదు అనే సందేహం వ్యక్తమవుతుంది  ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్  చేస్తున్నారు. ఈ చిత్రంలోని విద్యార్థి పేరు అల్తాఫ్ పదవ తరగతి చదువుతున్నాడు. మా తరగతి గదిలో నిత్యం మురుగు వాసన తో ముక్కుపుటాలు పగిలి పోతున్నాయి. ఈ దుర్గం దానికి తరగతిలోని విద్యార్థులు అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. ప్రతిరోజు ఈ వాసనతో చదువు పైన దృష్టి సారించే లేక పోతున్నాం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది .