గోదావరిఖనిలో గోదావరి నదిలోకి విషతుల్యాలు
కాలుష్య కోరల్లో గోదావరి,పట్టించుకోని పాలకులు. గోదావరిఖని,అగ్నిధారన్యూస్:గోదావరి నదిలోకి నేరుగా రసాయనాలతో కూడిన నీరు కలిసి ప్రజల ప్రాణాలకు ముప్పు వస్తున్న పట్టించుకోని పాలకులుండటం దూరదృష్టకరం అని, CPI నాయకులు మద్దెలదినేష్ అన్నారు.కలుషిత నీరు నేరుగా గోదావరిలో కలుస్తున్నాయి.ఎస్టీపిలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం తగదన్నారు.
ప్రజా ప్రతినిదులకు స్వచ్ఛమైన నీరు. ప్రజలకేమో మురుగు నిటితోపాటు అదనంగా రసాయనాలతో కూడిన నీళ్లు అందించడం ఏంటి? ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.యుద్ధ ప్రాతిపదికన ఎస్టీపి లు ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని సంబంధించిన అధికారులను మరియు పాలకులను సిపిఐ పక్షణ డిమాండ్ చేశారు.