కామారెడ్డిజిల్లా  శ్రీనివాస్

కామారెడ్డిజిల్లా,అగ్నిధార,న్యూస్ :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ అధికారుల బదిలీలు జరిగిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఎస్ పి శ్వేతా రెడ్డి, స్థానంలో నూతనంగా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న డి.శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని ఆదివారం రోజు హైదరాబాద్ తన అధికారిక నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  ఆయనకు శుభాకాంక్షలు తెలిపి స్వాగతించారు.