పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మంథని రహదారిపై, రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు . స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు ?  ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందాడు.కమాన్ పూర్ కు చెందిన తుమ్మల శరత్ తండ్రి రాజేశం దాదాపు  29 సంవత్సరాలు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పెద్దపల్లి నుండి తన స్వస్థలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ముందున్న కారుని తప్పించే క్రమంలో  ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని సమాచారం . మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బసంత నగర్ ఎస్ ఐ మహేందర్  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.