గోదావరిఖని అగ్నిధార న్యూస్ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లానూతన కార్యవర్గం ఎన్నిక” పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికలలో టీజెఏ గౌరవ సలహాదారుగా సంకనపల్లి స్వామి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, టీజెఏ జిల్లా అధ్యక్షునిగా కలువల అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గా గుర్రాల రవి, జిల్లా కోశాధికారిగా జీలకర్ర రమేష్ ఉపాధ్యక్షుడిగా కలవలేని జీవన్ బాబు, గోగుల లక్ష్మీనారాయణ,కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గడ్డం రాజు, సంయుక్త కార్యదర్శిగా హాకీ మోదిన్, గౌరీ ప్రభాకర్ కండే రవీందర్ ఎన్నుకోవడం జరిగింది.        ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని కష్టాల్లో ఆదుకునే ప్రయత్నం టి జే ఏ చేస్తుందని ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సదుపాయాలను జర్నలిస్టు ఇచ్చే విధంగా కృషి చేస్తానని, తన ఎన్నిక సహకరించిన ప్రతి టి జే ఏ సభ్యులకు కృతజ్ఞతలు, తెలియజేశారు. తనతోపాటు నూతనంగా ఎన్నికైన టి జె ఏ జిల్లాకమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలుతెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ ,ఆశాద్రి తదితరులు పాల్గొన్నారు.