పేద ప్రజల అభ్యున్నతే సిపిఐ లక్ష్యం రాబోయే కాలంలో కమ్యూనిజమే ప్రత్యన్మయం .
గోదావరిఖని అగ్నిధార న్యూస్ ఖనిలో ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 97వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఖనిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. భాస్కర్ రావ్ భవన్లో సిపిఐ నగరకార్యదర్శి కె.కనకరాజ్, అవిస్కరించారు. అలాగే స్థానిక చౌరస్తాలోసిపిఐ, సీనియర్, నాయకులు కె. స్వామి, 5వ ఇన్క్ లైన్లో మద్దెల దినేష్, ఎల్ బి నగర్ లో తాలపల్లి మల్లయ్య గార్లు జనగమలో సంబోదు కోమరయ్య తిలక్ నగర్ లో శనిగరపు చంద్రశేఖర్ తో పాటు వివిధ డివిజన్ లో ఆయా డివిజన్ కార్యదర్శులు జెండాలు అవిస్కరించారు. అనంతరం నగర కార్యదర్శి కె.కనకరాజ్ తో పాటు సిపిఐ సీనియర్ నాయకులు కె.స్వామి, గౌతమ్ గోవర్ధన్, వేల్పుల నారాయణ లు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులదే అని వారు అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన పార్టీ నాటి నుండి నేటి వరకు పేద ప్రజల పక్షాన నిలబడి అనేక హక్కులను సాధించిందని పనికి గ్రామీణ ఉపాధి హామీ పధకం, సమాచార హక్కు చట్టం ఇలాంటి చట్టలే కాకుండా దున్నేవాడిది భూమి అనే నినాదంతో లక్షలాది ఎకరాల భూములు పేద ప్రజలకు పంచిన ఘనత ఓక్క సిపిఐ కి మాత్రమే దక్కింది అని, ఓట్లు వేయకపోయిన సీట్లు రాకపోయినా చట్టసవలకు వెళ్లకున్న ప్రజా గొంతుకును వినిపించే పార్టీ ఏదైనాఉందంటే అది ఒక సిపిఐ మాత్రమే అని వారన్నారు. ఎప్పటిక్కప్పుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ పోరాడుతూ నిత్యం ప్రజల వెన్నంటే వుంటుందని ప్రజలు కూడా కమ్యూనిజం వైపున పునరాలోచన చేస్తున్నారని రాబోయే కాలంలో ప్రజా పోరాటాలను మరింత ఉదృతం చేస్తామని వారు తెలిపారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కందుకూరి రాజరత్నం, అరెల్లి పాశం, మడికొండ ఒధమ్మ, శనిగారపు చంద్ర శేఖర్, సురేందర్, ఏజ్జ రాజయ్య, పడల కనకరాజ్, గోడిశల నరేష్, సంకే అశోక్, కరీం, దేవయ్య, వై.లెనిన్, మార్కపూరి సూర్య, సుధీర్, అనురాజ్, సిర్ర మైసయ్య, రాజమ్మ, బూడిద మల్లేష్, దాసరి రామస్వామి, సిరిసిల్ల మల్లేష్, కుమార స్వామి, ఆర్కుటి శ్రీనివాస్, సాయన్న, తదితరులు పాల్గొన్నారు.
