ప్రజల రక్షణ మరియు ప్రజలకు సెన్సాఫ్ సెక్యూరిటీ భద్రతాభావం కలిగించడం గురించి “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్” నిర్వహించడం జరిగింది

పెద్దపల్లి జిల్లా అగ్నిధార న్యూస్.పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి IPS  ఆదేశానుసారం పెద్దపల్లి ఏసిపి సారంగపాణి,ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిష్టంపేట 80 మంది అధికారులు సిబ్బంది తో “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్” కార్యక్రమం (సిసిపి) నిర్వహించడం జరిగింది.పెద్దపల్లి ఏసీపీ మాట్లాడుతూ
ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని, గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత బస్తిలుగా, గ్రామలుగా చేయలనే ఉద్దేశ్యం గురించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. నేనుసైతం అనే కార్యక్రమం ద్వారా గ్రామాలలోని ప్రజలు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు గ్రామ పెద్దలు, వివిధ కుల సంఘాల నాయకులు, సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.
◆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన అమాయకులైన ప్రజలను కేసుల నుండి రక్షించవచ్చు, మరియు గ్రామంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చునని ఏసిపి గారు తెలిపారు. ఎలాంటి పేపర్లు లేని మోటార్ సైకిల్స్ 26, Autos-04, Tractors-02 total-32 వాహనాలను సీజ్ చేశామన్నారుఈ రోజు స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులు వాటికి సంబంధించిన పత్రాలు చూపించిన తర్వాత తిరిగి వారి వాహనాలను వారికే అప్పగించడం జరుగుతుందని తెలిపారు.
కోవిడ్ ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విజంభిస్తున్నా దృష్ట్యా అందరూ మాస్క్ ధరించి కోవిడ్ నిబంధనలు పాటించాలిప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు,ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడపవద్దని నడిపేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపినారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఈ మధ్యకాలంలో హెల్మెట్ లేక కొందరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందని హెల్మెట్ భారంగా కాకుండా బాధ్యతగా భావించి ధరించాలని సూచించారు.పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని కొనాలని డాక్యుమెంట్స్ లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని తెలిపినారు.గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ, తిరుగుతున్న మరియు గ్రామం లో చుట్టుపక్కల గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుడుంబా,గుట్కాలు అమ్ముతున్నా, పేకాట ఆడిన వారి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలపాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని వారి తల్లిదండ్రులకు మరియు వారి ప్రాంతానికి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలను రక్షించడానికే తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుముఖం ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపినారు. సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతోమంది తమ విలువైన డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది. సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే బ్యాంకు సంబంధించిన వివరాలు, ఓటిపి తదితర నెంబర్లు ఎవరికీ తెలియపరచ కూడదు వాట్స్అప్ లలో అనుమానాస్పదంగా వచ్చే బ్లూ కలర్ మెసేజ్లను క్లిక్ చేయకూడదు సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయడం బాధితులకు ఉన్న ఒకే ఒక గొప్ప ఆయుధం. టోల్ ఫ్రీ నెంబర్లు 155260, డయల్ 100, 112 లకు కాల్ చేయండి తదితర అంశాల గురించి గ్రామస్తులకు తెలియపరిచారు.తరచుగా గ్రామాలలో పట్టణాలలో కాలనీలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో CI సుల్తానాబాద్ ఇంద్ర సేన రెడ్డి , SI లు కాల్వశ్రీరాంపూర్ వెంకటేష్, సుల్తానాబాద్ ఉపేందర్ రావు, జూలపల్లి వినీత, ధర్మారం ఎస్ ఐ అశ్విని, పెద్దపల్లి ఎస్ఐ లు రాజవర్ధన్, సహదేవ్‌సింగ్, పొత్కపల్లి ఎస్ ఐ లక్ష్మణ్ మరియు 80 మంది సిబ్బంది పాల్గొన్నారు.