న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా ఇంటిలోనే జరుపుకోవాలి

కోవిడ్ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన  చర్యలు తప్పవు : సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి  

సుల్తానాబాద్ అగ్నిధార న్యూస్ ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా రాష్ట్రంలో వేరియంట్ ను నియంత్రించడంలో భాగంగా న్యూ ఇయర్ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది.విధించిన ఆంక్షలను అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోనబడుతాయని సీఐ  సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని సుల్తానాబాద్, జులపల్లి, పొత్కపల్లి మరియు కాల్వశ్రీరాంపూర్ ప్రజలకు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అనుసరించి వచ్చే నెల జనవరి 2వ తేదీ వరకు ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేదించబడటంతో పాటు, అధికారిక కార్యక్రమాల్లో హజరయ్యేవారు తప్పని సరిగా మాస్కును ధరించి, భౌతిక దూరాన్ని పాటించాల్సి వుంటుంది . ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఒక ప్రకటన లోతెలియజేసారు.
నూతన సంవత్సర వేడుకలు ప్రతి ఇంట ఆనందోత్సవాల నడుమ నిర్వహించుకోవడంతో పాటు, ఎలాంటి యాక్సిడెంట్‌స్ లేకుండా సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్‌ స్టేషన్స్ పరిధిలో యువత మద్యం సేవించి నిర్లక్ష్య ధోరణితో వాహనాలను అతివేగంగా నడిపి రోడ్డు ప్రమాదాలకు గురికావడంతో కొత్త సంవత్సరం వేల వారి కుటుంబంలలో విషాదం కలుగడంతోపాటు కోన్ని సందర్బాల్లో వాహనదారులతో పాటు సాధరణ ప్రజలు తీవ్ర గాయాలకు గురై ఆకాలంగా మరణిస్తున్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నియంత్రణకై సర్కిల్ పరిధిలో నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ముమ్మరంగా పెట్రోలింగ్‌ నిర్వహించబడుతుందని మరియు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిచడం, ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలను నడిపే వాహనదారులను కట్టడి చేసేందుకై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది అని అన్నారు.డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టీంలతో తనీఖీలు నిర్వహించడంతో పాటు, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకుగాను అన్ని ప్రధాన రోడ్డు మార్గాల్లో రోడ్లపై బారీకెడ్లను ఏర్పాటు చేయబడుతాయని తెలిపారు.ముఖ్యంగా యువత నూతన సంవత్సర వేడుకలను మద్యంతో కాకుండా కుటుంబ సభ్యుల నడుమ సంతోషాలతో నిర్వహించుకోవాలని, రాబోవు కోత్త సంవత్సరంలో ప్రజలు తాము నిర్థేషించుకున్నా లక్ష్యాలను చేరుకోవాలని, ప్రతి ఇళ్ళు సుఖ సంతోషాలకు నేలవు కావాలని ఆకాంక్షిస్తూ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.ఈ పత్రికా సమావేశంలో సిఐతో పాటు సుల్తానాబాద్ S I ఉపేందర్ రావు పాల్గొన్నారు.