పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం రోజున తెల్లవారుజామున 5 గంటలకు స్వచ్ఛ సర్వెక్షన్-2022 కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దాసరి మమత రెడ్డి పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆధ్వర్యంలో… మున్సిపల్ అధికారులు సిబ్బంది పెద్దపల్లి పట్టణం అయ్యప్ప టెంపుల్ చౌరస్తా వద్ద (PHW) వర్కర్స్ కి శారీరక ఆరోగ్యం కొరకు( ఫిజికల్ ఫిట్నెస్ కొరకై యోగ ,ఎక్సర్సైజ్) శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణంలోని 22 వ వార్డ్ సందర్శించి కౌన్సిలర్ ఉప్పు స్వరూప రాజు ను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమంలో , వైస్ చైర్ పర్సన్ నాజ్మీన్ సుల్తాన్ మొబిన్, 14 వ వార్డ్ కౌన్సిలర్ అంజుం సభీర్ ఖాన్,25 వ వార్డ్ కౌన్సిలర్ కార్తిక్ ,మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
