ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ ఆంక్షలు
జగిత్యాల డిఎస్పీ రత్నాపురం ప్రకాశ్.
జగిత్యాల,అగ్నిధారన్యూస్: ఓమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ ఈ సంవత్సరం నూతన సంవత్సర వేడుకలు శృతి మించకుండా జరుపుకోవాలని పోలీసుల సూచనలు పాటించాలని డిఎస్పీ తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనుటకు హైకోర్ట్ ఆదేశాల అనుసారం ఎక్కడ కూడా ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలకు అనుమతి లేదు, ఎక్కువ సంఖ్యలో గుమిగూడ రాదు.నూతన సంవత్సర వేడుకలను ప్రజలు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంటివద్దనే ఆనందంగా జరుపుకోవాలి.తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంట్లో తమతో వేడుకలు జరుపుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలిమాస్క్ ధరించని వారికి 1000/- రూ.ల జరిమానా.శబ్దకాలుష్యముకు కారణమయ్యే డీజేలు,మొదలైనవాటి,నివినియోగించరాదు.టపాసులు పేలుస్తూ ఇతరులకు అసౌకర్యం, ఇబ్బంది కలిగించ రాదు.నిబంధనలు ఉల్లంగించే వారిపై కొరడా జులిపించడానికి 31వ తేదీ రాత్రి 9:00 గంటల నుండి డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయుటకు ప్రత్యేక బృందాల ఏర్పాటు.ఎవరైనా మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ కనిపిస్తే, వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు కొంతమంది యువకులు అర్ధరాత్రి దాటిన తర్వాత కాలనీల్లో మోటార్ సైకిల్ పై తిరుగుతూ యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సందర్భాలు దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు.త్రిబుల్ రైడింగ్ వెళ్ళితే కేసులు నమోదు.మైనర్లు మోటార్ సైకిల్ నడుపుతూ రోడ్లపై కనిపిస్తే ఆ మోటార్ సైకిల్ యజమానిపై మరియు తల్లిదండ్రుల పై చర్యలు.ఈ నిబంధనలకు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు అని తెలిపినారు.
