నిట్టూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు (35 లక్షలు)భూమిపూజ,చేసిన,ఎమ్మెల్యే,దాసరి. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అభివృద్ధి పనులకు ,..(SDF నిధుల ద్వారా 23 లక్షలు మరియు SFC నిధుల ద్వారా 12 లక్షల ) సీసీ రోడ్లకు భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడంలో అహర్నిశలు కృషి చేస్తుందన్నారు దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాలు ఆ గ్రామాల్లో ఉండే ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది చేపడుతుంది అన్నారు రైతులకి రైతుబంధు రైతు భీమా వృద్ధాప్య వికలాంగుల ఆసరా పెన్షన్ లు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మొదలైన అనేక ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ,ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,సర్పంచ్ కవిత-వెంకట్రాజం, మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, రైతు సమితి అధ్యక్షుడు వేణుగోపాల్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి రావు,గ్రామ పాలక వర్గం, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
