పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి పట్టణం తిలక్ నగర్ 52వ బూత్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ సేకరణలో భాగంగా మాజీ ఎంపీటీసీ సభ్యుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ కాలనీవాసులకు సభ్యత్వం అందించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 33 వ వార్డు కౌన్సిలర్ భూత గడ్డ సంపత్ హాజరై ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆశయాలను వివరించారు .కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి పట్టణంలో విశేష ఆదరణ లభిస్తుం అన్నారు . రాష్ట్ర సాధన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో వచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చినా టిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా వచ్చిన ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ పౌర స్వేచ్ఛ దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల ఇన్సూరెన్సు వర్తిస్తుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ,ఆరోగ్యశ్రీ 108, రైతులకు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లు ,యువతకు ఉపాధి కల్పన, మహిళలకు ప్రత్యేక పథకాలు తీసుకువచ్చి సంక్షేమ రాజ్యాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు రావాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, విజయరమణారావుల నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాచమల్ల శ్రీనివాస, మక్బుల్ ,మున్వర్ అలీ లు పాల్గొన్నారు.
