చిత్తూరుఅగ్నిధారన్యూస్:ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నూతన 2022 వ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రిన్సిపల్,డాక్టర్. విజయ భాస్కర్. ……………………………………………………………….. కళాశాల అధ్యక్షులు
మాట్లాడుతూ నూతన సంవత్సరం ఉద్యోగులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఉద్యోగుల సమస్యలను నా దృష్టికి తీసుకు వస్తే తక్షణమే స్పందిచి పరిష్కరిస్తానని అన్నారు. కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ ,సెకండ్ వేవ్ సమయంలో ఉద్యోగులు ప్రాణాలకు తెగించి పని చేశారని కొనియాడారు . కరోనా మరల ఉద్ధృతం అవుతున్నట్లు వస్తున్న సంకేతాల దృష్టిలో మనం జాగ్రత్తగా ఉండి ప్రజలను చైతన్యపరిచి కరోనా బారినుండి కాపాడుకోవాలని తెలియజేశారు.
ఈ సమావేశంలో కళాశాల ఉపాధ్యక్షులు డాక్టర్ సంధ్య ,కళాశాల ఓఎస్డీ డాక్టర్ చంద్రశేఖర్, కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ ఎం నాగరత్నమ్మ ,ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ .గిరిబాబు, వెంకటేశ్వర వైద్య కళాశాల అధ్యక్షులు వీర కిరణ్, కార్యదర్శి కేసి సుబ్రహ్మణ్యం ,కోశాధికారి కె బాలసుబ్రహ్మణ్యం,కళాశాల మేనేజర్ శ్రీమతి పద్మజ , శ్రీ నారాయణ మూర్తి , యూనియన్ నాయకులు కె .రాజ్యలక్ష్మి,టి.శ్రీదేవి, జే. వెంకటపతి రాజు ,పి.బిల్వ కుమారి , ఆర్ బీ. షీలా, మునిరత్నం, ఓ. స్వర్ణ ,నాగమ్మ, నాగమణి ,రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
