12 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు విజయవంతం
పెద్దపల్లి అగ్నిధార న్యూస్:పెద్దపల్లి జిల్లా కేంద్రం స్థానిక సవేర ఆప్టికల్స్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరం నుండి 12 మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించామని లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ అధ్యక్షులు లయన్ పూదరి దత్తాగౌడ్ తెలిపారు.వీరికి కరీంనగర్ లోని రేకుర్తి కంటి దవాఖానలో ఉచిత రవాణా భోజన వసతులతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్ లయన్ చిదుర సురేష్ సహకారంతో ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించమన్నారు. కంటికి సంబంధిత వ్యాధులు ,శాస్త్ర చికిత్స అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదించినట్లయితే ఉచితంగా  శాస్త్ర చికిత్సలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీశక్తి అధ్యక్షురాలు లయన్ విజయగిరి సుధ,లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ క్లబ్ డైరెక్టర్ లయన్ అబ్దుల్ వాసే,సభ్యులు లయన్ భూతగడ్డ చందు,సిద్దార్థ పారా మెడికల్ కళాశాల డైరెక్టర్ వంగల రవీందర్ పాల్గొన్నారు.