బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుగ్యాల ప్రదీప్ కుమార్ ఆదేశానుసారం ……….. పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: బిజెపి సీనియర్ నాయకులు తంగెడ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్దపల్లి కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో ఉండి 317 జీవోను సవరించాలని జాగరణ దీక్ష చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ఆదేశాలతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిన తలుపులను బద్దలు కొట్టడం సమంజసమా. శాంతియుతంగా చేస్తున్న దీక్ష పట్ల ఇంత మూర్ఖంగా కర్కశంగా వ్యవహరించడం దారుణం, ప్రతిపక్షాలపై, భారతీయ జనతా పార్టీ పై తెలంగాణ ప్రభుత్వం వ్వవహారించిన,వ్యవహరిస్తున్న తీరు అవమానకరం అన్నారు .దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నాం, ఖండిస్తున్నాం, ప్రజా ఉద్యమాలను ఈవిధంగా అణచాలనుకోవడం అవివేకం, బండి సంజయ్ కుమార్ తలకు గాయమై రక్తం ధారగా కారుతున్నా పట్టించుకోకుండా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం, పోలీసుల దౌర్జన్యం కారణంగా గాయాలపాలైన బండి సంజయ్ కుమార్ అన్ని వర్గాల ప్రజల సమస్యలపై శాంతియుతంగా నిరంతరంగా చేస్తున్న ఉద్యమాలను చూసి కెసిఆర్ ప్రభుత్వం భయపడుతుంది అన్నారు . ప్రజావ్యతిరేక వెల్లువను ఆపలేరు . కెసిఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు అన్నివర్గాల ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు అన్నారు. మంత్రుల ర్యాలీలకు, సభలకు లేని కోవిడ్ నిబంధనలు భాజాపా నిరసనలకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తారు. ఇది చరిత్ర లో మరొక అత్యంత మూర్ఖపు చేష్టగా మిగిలి పోతుంది అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల , నిరుద్యోగుల, రైతుల, విద్యార్థుల ఆగ్రహానికి కెసిఆర్ పరిపాలన గురికాక తప్పదు, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మా పోరాటాన్ని నిలిపేది లేదు సరికదా మరింత ఉధృతం చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సిలారపు పర్వతాలు, obc రాష్ట్ర కోఆర్డినేటర్ తాత రవి యాదవ్, పోలుసని సంపత్ రావు, బెజ్జంకి దిలీప్ కుమార్, కౌన్సిలర్ మహంతా కృష్ణ, ముంజ రాజేంద్రప్రసాద్, వసీం రాజా, వోలె తిరుపతి, ఉప్పు కిరణ్, ప్రదీప్, అరేపల్లీ రాహుల్, ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీకాంత్, పడాల వీరేశం, సాయి, మరియు వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు.
