పెద్దపల్లి,అగ్నిధారన్యూస్:సోమవారం రోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా. మహనీయుల ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొంకురి కైలాసం ఆధ్వర్యంలో పెద్దపల్లి కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకుంటూ ఆడపిల్లల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళ అన్నారు . మహిళల హక్కుల కోసం విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి అన్నారు. ఈ కార్యక్రమంలో , ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు బింగి రాజు ,పట్టణ టౌన్ ప్రధాన కార్యదర్శి తుంగ రాజ్కుమార్ కల్వల మల్లేష్ ,కట్కూరి సందీప్ ,కండే కర్ణాకర్ తదితరులు.