హత్యకు పాల్పడిన వ్యక్తి మరియు హత్య గురించి తెలిసినా కూడా చెప్పని ఇద్దరు వ్యక్తులు అరెస్ట్… రిమాండ్ కి తరలింపు….                              పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి మండలం లో కలకలం రేపిన హత్యోదంతం ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం ముత్తారం గ్రామానికి చెందిన సింగరేణి రాజు s/o లచ్చయ్య వారి గ్రామానికి చెందిన మోతి తిరుపతి, బొంకురి మల్లేశం, వాడ్కాపురం రంగయ్య తో కలిసి ఆటోలో వెళ్లినట్లు తెలిసింది. సాయంత్రం వరకు కూడా ఇంటికి రానందున తన ఫోన్ స్విచాఫ్ వస్తుండడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా తన కుమారుని యొక్క ఆటో గౌరెడ్డిపేట్  శివారులోని దొంతి రెడ్డి కాశి రెడ్డి కి సంబంధించిన వాడుక లేని వ్యవసాయ భావి పక్కన ఆటో కనిపించగా ఆ చుట్టుపక్కల మరియు బావిలో వెతుకగా బావిలో నీటిపై బోర్లా పడి ఉండడం కనిపించింది. శవం బయటికి తీసి చూడగా ఎడమ చెవి భాగం పోయి తీవ్ర రక్త గాయమై మరియు తలపై రెండు చోట్ల రక్త గాయాలు ఉన్నాయి. తన కొడుకు మరణానికి పైన తెలిపిన వ్యక్తులు కారణమని పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అనుమానం గా ఉన్నటువంటి వ్యక్తులను విచారించడం జరిగింది. ఈరోజు నిందితులు తమ స్వగ్రామమైన పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామానికి బైక్ పైన వస్తుండగా బంధంపల్లి ఫ్లై ఓవర్ వద్ద అనుమానస్పదంగా కనిపించిన వారిని పట్టుకుని విచారించగా హత్య చేసిన విషయాన్ని ఒప్పుకోవడం జరిగింది.నిందితుల వివరాలు    1.మోతె తిరుపతి s/o నర్సయ్య,45yrs, ముదిరాజ్, ముత్తారం, పెద్దపల్లి మండలం. ……………………………………… 2.బొంకురిమల్లేష్,s/oలింగయ్య,మాదిగ,గౌరెడ్డిపెట్, పెద్దపల్లి ……………..3.వడ్కాపురం రంగయ్య s/o విద్య చారి,39yrs,వడ్రంగి,ముత్తారం.    …………          వివరాల్లోకి వెళితే…. తేది 01-01-22 రోజున పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన మోతె తిరుపతి, తన కి తెలిసిన అదే గ్రామానికి చెందిన  సింగరేణి రాజు, కి చెందిన ఆటో కిరాయి కి తీసుకోని ఆటోలో పెద్దపల్లి కి వచ్చి పెద్దపల్లి లో నివాసం ఉండే తిరుపతి స్నేహితుడు ఐనా బొంకురి మల్లేశం ఇంటికి వెళ్లి పార్టీ చేసుకుందాం అని రమ్మని చెప్పగా మల్లేశం తన మోటర్ సైకిల్ పైన రాగ, తిరుపతి, రాజు లు ఆటోలో వడ్కాపురం రంగయ్య ఇంటికి వెళ్లి రమ్మనగా రంగయ్య, మల్లేశం బైక్ పైన రాజు, తిరుపతి ఆటోలో గౌరెడ్డి పేటకు చెందిన నలుగురు కలిసి గౌరీ రెడ్డి పేట గ్రామ శివారులో గల దొంతి రెడ్డి కాశిరెడ్డి కి చెందిన పత్తి చేను పక్కన వాడుకలో లేని వ్యవసాయ బావి పక్కన మందు పార్టీ చేసుకోవడం జరిగింది. పత్తి చేనులో పని చేసే వ్యవసాయ కూలీలు తీసుకుపోవడానికి అటుగా ఆటోలు రావడంతో మల్లేశం అక్కడి నుండి దూరంగా వెళ్లిపోవడం జరిగింది. ఇదే సమయంలో మోతె తిరుపతి కి రాజు మద్యం మత్తులో గొడవ జరగగా అట్టి గొడవ తో తిరుపతి కోపానికి లోనై రాజు ని చంపాలని నిర్ణయించుకుని కొట్టి పక్కనే ఉన్న వ్యవసాయ బావి లోకి నెట్టి వేయడం జరిగింది. ఇట్టి తిరుపతి కి సహకరించిన మల్లేష్ మరియు రంగయ్య లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది.