జగిత్యాల,అగ్నిధారన్యూస్:
కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామానికి చెందిన అగుల్ల రాజేశ్వరి దినసరి కూలీ పనులు చేసుకుంటూ జీవనం పొందుతుంది.రోజు వారి కూలీ పనులలో భాగంగా ఈ రోజు కూడా ఇంట్లో పనులన్నీ ముగించుకొని కూలి పనికి వెళ్ళిన తర్వాత విద్యుత్ షాక్ సర్క్యూట్ అయి ఇల్లు పూర్తిగా కాలి బూడిద అయింది.ఇరుగు పొరుగు వారు గమనించి నీటితో మంటలను ఆర్పేశారుఇంటిలో దాచుకున్న నగదుతో పాటు వస్తువులు అన్ని కాలి బూడిదవ్వడంతో ఇంటి యజమానురాలు రాజేశ్వరి తీవ్ర దుఃఖంతో కన్నీరు మున్నీరయ్యారు.విషయం తెలుసుకున్న కొడిమ్యాల సింగిల్విండో చైర్మన్ మేనేని రాజనర్సింగరావు హుటాహుటిన పూడూరు గ్రామానికి చేరుకొని కాలి బూడిదైన  ఇంటిని పరిశీలించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన వంతుగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి, చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్  దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపు నుండి వారిని ఆదుకునేల చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెద్ది కవిత రవి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పొనుగోటి కృష్ణారావు, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, కొండగట్టు దేవస్థాన డైరెక్టర్ వొల్లాల లింగగౌడ్, నాయకులు ఈదురి అబ్రహం, గడ్డమీది రమేష్ గౌడ్,జలంధర్ గౌడ్,గణేష్, చిన్న సుధాకర్, గుండు రాజ్ కుమార్, గుడికందుల వినోద్ యూసుఫ్,తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .