జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం గొడిశెల పేట గ్రామంలో ఘనంగా రైతుబంధు ఉత్సవాలు.                                                    జగిత్యాల జిల్లా అగ్నిధార న్యూస్ వెల్గటూర్ మండలం గొడిశెల పేట గ్రామంలో రైతుబంధు ఉత్సవాలు భాగంగా మంగళవారం క్లష్టర్   రైతు వేదిక వద్ద మిర్చి మరియు పత్తి పంటలతో “రైతు బంధు ” ముగ్గులు వేసి రైతులుసంబరాలు జరుపుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకునే పాపాన పోలేదని, రైతులకు పెట్టుబడి ఇచ్చి రైతును రాజును చేస్తున్న భారత దేశంలోనే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. జన్మంతా ముఖ్యమంత్రి కి, అలాగే ధర్మపురి నియోజకవర్గం కి గోదావరి పై 13 లిఫ్ట్ లు మంజూరు చేయించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి రైతులందరూ రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు మెతుకు స్వరూప స్వామి ,vice mpp ముస్కు కవిత దేవేందర్ రెడ్డి ,ఉప సర్పంచు జెల్ల శ్రీనివాస్  గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు  AEO అయ్యోరి వినోద్  గ్రామ రైతు బంధు సమితి సభ్యులు ,గ్రామ రైతులు పాల్గొన్నారు.