పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి మండలం లోని చీకురాయి గ్రామంలో పెద్దపల్లి క్లస్టర్ రైతువేధిక లో “రైతుబంధు సంబరాలు- వారోత్సవలు “చీకురాయి గ్రామ సర్పంచ్ బండారి త్రివేణి , అధ్యక్షతన నిర్వహించారు .ఇట్టి కార్యక్రమానికి పెద్దపల్లి ZPTCబండారిరాంమూర్తి,హాజరై  మాట్లాడుతూ. రైతుబంధు పెట్టుబడి మద్దతు పథకం” ద్వారా 2018 నుండి ఈ యాసంగి పంట వరకు రైతుల ఖాతాల్లో 50 వేల కోట్ల కు పైగా నగదు జమ కావడం వలన రాష్ట్ర ప్రభుత్వం- వ్యవసాయ శాఖ ఈ వారోత్సవాలను జనవరి 3 నుండి 10 వరకు నిర్వహిస్తుంది అన్నారు. ఈ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. AEO వినయ్ కుమార్ రైతుబంధు సమితి కో-ఆర్డినెటర్ జక్కుల రాజేశం , రైతులు శంకరి స్వామి,రవి ,రాయమల్లు పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.