పెద్దపల్లి అగ్నిధార న్యూస్. పెద్దపల్లి పట్టణంలో శుక్రవారం రోజు స్థానిక బస్టాండ్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద విరసం పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా విరసం కన్వీనర్ బాలసాని రాజయ్య,, మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తమదైనా భావజాలంతో రచనలు, సాహిత్యం ద్వారా విరసం ప్రజల ముందుకు తీసుకెళ్తుంది.సామాన్య ప్రజలు,రైతులు, కార్మికులు, మేధావులు, హక్కులసంఘాలనాయకులపై  ప్రభుత్వ విధానాలను ప్రశ్నించ్చినందుకు అక్రమ కేసులు, UAPA వంటి కేసులు మోపి జైల్లాలో నిర్భందిస్తుంది ఇట్టి చర్యలను విప్లవ రచయితల సంఘం(విరసం) ఖండిస్తుంది.ఈసందర్బంగాఉద్యమాలే ఊపిరిగా నెల్లూరు (ఆంధ్రప్రదేశ్ )లో జరిగే విరసం 28వ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలనీ ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, మహిళా, శ్రామిక వర్గలకు విరసం పిలుపునిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి కొమురయ్య, జిల్లా కన్వీనర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్, పెద్దపల్లి . గాండ్ల మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు, తెలంగాణ ప్రజా ఫ్రంట్, పెద్దపల్లి.