పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపెల్లి జిల్లాలోని గ్రామాలలో ప్రభుత్వ బోర్ వెల్స్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి దర్జాగా వాడుకుంటున్నారు అనే విమర్శలుఅక్కడఅక్కడవ్యక్తమవుతున్నాయి. .ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ మంచినీటి సరఫరా ఒక బృహత్తర కార్యక్రమం ఈ మంచినీటి సరఫరా వ్యవస్థ లేనప్పుడు గ్రామాలలో ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు గ్రామాలలో ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం పోటీపడి గ్రామాలలో పట్టణాలలో బోర్ వెల్స్ వేయించిన సంఘటనలు అనేకం కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నం మిషన్ భగీరథ పథకం వచ్చాక ఇంటింటికి మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశాక గతంలో వేయించిన బోర్ వెల్స్ యొక్క ఉపయోగం తగ్గిందని చెప్పాలి,ఈ క్రమంలోనే ప్రభుత్వ బోర్ వెల్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి దర్జాగా బోర్వెల్ కి మోటార్లు బిగించుకొని వాడుతున్నారు అనేది విమర్శ , సంబంధిత శాఖ అధికారులు అటువైపుగా కన్నెత్తిచూడకపోవడంతో వాడుకున్న వారికి వాడుకున్నంత అనే చందంగా తయారయింది. బోర్ వెల్ ల పరిస్థితి ఇప్పటికైనా సంబంధిత అధికారులు అటువైపు దృష్టి సారించి గ్రామాల వారీగా సంబంధిత అధికారులతో బోర్ వెల్స్ సర్వే చేయించి అన్యాక్రాంతమైనటువంటి బోర్లను గుర్తించి ప్రభుత్వ బోర్లు దుర్వినియోగం కాకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
