జగిత్యాల,అగ్నిధారన్యూస్:       కొడిమ్యాల మండలంలోని చెఫ్యాల గ్రామానికి చెందిన బరిగెసాగర్ గత 4రోజుల క్రితం మృతిచెందగా మృతుని భార్య బరిగె రక్షిత కు సోమవారం రోజున తెరాస నాయకుడు గాడిచెర్ల శ్రీకాంత్ రెడ్డి కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజ నర్సింగారావు తో కలిసి‌ ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారు
బరిగె రక్షిత కు ప్రతీ నెలా 25 కిలోల బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులను కూడా సంవత్సరంపాటు అందజేస్తానని గాడిచెర్ల శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
అదే గ్రామానికి చెందిన కూనవేని సాయికృష్ణ కుటుంబ సభ్యులను పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో చెప్యాల సర్పంచ్ ఊట్కూరి.రాజశేఖర్ రెడ్డి, MPTC ఊట్కూరి మల్లారెడ్డి, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ నాయకులు గంగాధర సురేష్, కొత్తూరి స్వామి, కోలాపురం రమేష్, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు