పెద్దపల్లి అగ్నిధార న్యూస్ బహుజన సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించబడి పెద్దపల్లి కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా పెద్దపల్లి బి ఎస్ పి నాయకులు దాసరి ఉషాని సోమవారం రోజు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువాతో సన్మానించారు.సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి బహుజన రాజ్యాఅధికారం కోసం RS ప్రవీణ్ కుమార్ బాటలో నడవడానికి సంసిద్ధమై బి ఎస్ పి పార్టీ లో చేరనన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో నడుస్తూ పెద్దపల్లి జిల్లాలో బీఎస్పీ పార్టీ అభివృద్ధికి కార్యకర్తల అండదండలతో పార్టీని బలోపేతం చేస్తాను అన్నారు. జిల్లాలోని ప్రతి కార్యకర్త కు అండగా ఉంటానన్నారు .ఈ సందర్భంగా తను ఘనంగా సన్మానించిన ప్రతి కార్యకర్త కు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.