నిషేధిత పొగాకు, గుట్కా ఉత్పత్తులు పట్టివేత
నస్పూర్,అగ్నిధారన్యూస్: .శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల  సమావేశంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు మాట్లాడుతూ,  శ్రీరాంపూర్ కాలనీ లో నిషేధిత గుట్కా ఉత్పత్తులు పట్టుకున్నట్లు  తెలిపారు. శ్రీరాంపూర్ కాలనీ లోని హిమ్మత్ నగర్ కు చెందిన రాయపూడి నాగేశ్వరరావు అనే వ్యక్తి రూ. 1లక్షా 35 వేల 800లు విలువగల నిషేధిత పొగాకు, గుట్కా ఉత్పత్తులు నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం మేరకు S I సౌజన్య, పోలీస్ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితునికి సహకరించిన వారిపై కూడా విచారణ చేపడతామని, ఎక్కువసార్లుకేసులునమోదయితే,పీడీయాక్ట్,అమలుచేస్తామనిఅన్నారు.ఈసమావేశంలో హెడ్ కానిస్టేబుల్ కె. సత్యనారాయణ, కానిస్టేబుళ్లు జి. శ్రీనివాస్, సంపత్, వెంకట్, తదితరులు పాల్గొన్నారు