ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎక్స్ గ్రేషియా చెక్ అందచేసిన ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి,అగ్నిధారన్యూస్: జూలపెల్లి మండలం వెంకట్రావు పల్లె గ్రామానికి చెందిన కొమ్మ కొమురయ్య (గొర్ల కాపరి) ఇటీవల విద్యుత్ ప్రమాదం లో ప్రమాదవశాత్తు మరణించారు . ప్రాథమిక గొర్రెల సహకార సంఘం మెంబర్ ఐనందుకు తెలంగాణ గొర్రెల మరియు మేకల పెంపకం దారుల సహకార అభివృద్ధి సమైఖ్య ద్వారా వారి భార్య కొమ్మ నర్సమ్మ కి 1,00,000/- రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్ అందచేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కార్యక్రమంలో ,యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం, యాదవ సంఘం ట్రస్ట్ అధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్,గోగురి నారాయణ,DAHO నారాయణ AD రవీందర్ రెడ్డి , Dr అజారుద్దీన్ తదితరులున్నారు.
