పేద కుటుంబాల కోసమే సంక్షేమ పథకాల అమలు
నస్పూర్, అగ్నిధారన్యూస్ : పేద కుటుంబాలు లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినట్లు మంచిర్యాల శాసనసభ్యుడు నడిపల్లి దివాకర్ రావు అన్నారు. మంగళవారం నస్పూర్ తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎస్సీ కార్పొరేషన్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆర్థిక స్థితిని మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈ సం పెళ్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, తహసిల్దార్ ఎం. జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిహెచ్. దుర్గాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రాయలింగు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ మాంతయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.