శ్రీరాంపూర్ లో అకాల వర్షం లేచిపోయిన పైకప్పులు
కాల్వ శ్రీరాంపూర్,అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పలు గ్రామాల్లో శుక్రవారం కురిసిన అకాల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఒకేసారి గాలులతో వీచిన రాళ్ల వర్షం కురవడంతో చెట్లు విరిగిపడ్డాయి, కొన్ని చెట్లు నేలకూలాయి, మండల కేంద్రం నుండి పెగడపల్లి వరకు రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు విరిగి పడడంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీరాంపూర్ వడ్డెర కాలనీకి చెందిన రంగుల నరేందర్ పెగడపల్లికి చెందిన కంకల ఓదెలు ఇంటి పైకప్పులు, రేకుల షెడ్లు లేచిపోయాయి. పెగడపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది కరెంటు లేక గ్రామం అంధకారం అయింది. ప్రభుత్వం స్పందించి నష్టం జరిగిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సర్పంచ్ లు ఆడెపు శ్రీదేవి రాజు, ఆరెల్లి సుజాత రమేష్ బాధితులు కోరుతున్నారు.
