ఎమ్మెల్యే దివాకర్ రావుఇంట్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు.
మంచిర్యాల,అగ్నిధారన్యూస్: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన స్వగృహంలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య శనివారం మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మకర సంక్రాంతి రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ అన్నారు.పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ ఆనందంతో జరుపుకొనే పండుగ సంక్రాంతి అన్నారు . పండుగ సందర్భంగా అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని అన్ని వర్గాల ప్రజలుఆనందతో పాడిపంటలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
