కాల్వశ్రీరాంపూర్ అగ్నిధారన్యూస్: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో శుక్రవారం రోజు సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మండలంలోని పలు గ్రామాలలో పెగడపల్లి గంగారం మంగపేట ఆశన్న పల్లె శ్రీరాంపూర్ కునారంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. వందలాది ఎకరాల మొక్కజొన్న, మిరపతోటలతో పాటు, మామిడి చెట్లు నేలకొరిగాయి. పండించిన పంట చేతికందే సమయంలో నేలపాలు కావడంతో రైతులు రైతుల బాధ వర్ణన రహితం మండలంలోని రైతులను ఓదార్చడానికి పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలను సందర్శించి, రైతులకు జరిగిన నష్టం పైన వారు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం, స్పందించి రైతులకు జరిగిన నష్టాన్ని ఇప్పించాలి అన్నారు. మక్క చేనుకు ఎకరాకు 40000 మిర్చికి ఎకరాకి లక్ష రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్,చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు, పెగడపల్లి సర్పంచ్ రమేష్ తార పల్లి మాజీ సర్పంచ్ సదయ్య వేమారెడ్డి స్వామి రెడ్డి కొమురయ్య శ్రీకాంత్ పరమేశ్ అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
