మా ప్రతినిధి జీవన్ మంచిర్యాలజిల్లా,అగ్నిధారన్యూస్: ఇది తెలిస్తే సైనికులకు జై కొట్టకుండా ఉండలేరుదేశంలో మనంతా ధైర్యంగా,స్వేచ్ఛగాజీవించగలగుతున్నామంటే.. అది భారత సైన్యం దయవల్లే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తమ కుటుంబాలను వదిలి దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనలను కంటికి రెప్పలా కాపాడుతోన్న సైనికులు, వారి ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భయమెందుకు ముందుకెళ్ళు భారతీయుడా ఆ బచ్చ గాళ్ళు తుంచి వేయ భారతీయుడా ఏకే 47 పట్టి ఎక్కుపెట్టి ముందుకెళ్లి పాకిస్తాన్ గుండా గాళ్ళ పాతాళంలో తొక్కి వేయ భరతమాత మొదటి బిడ్డవు భారతీయుడా ఈ దేశానికి రక్ష నీవే ఓ సైనికుడా అంటూ, మంచు కొండల్లో, గడ్డ కట్టే చలి, ఏడారులు, లోయల్లో నిద్రాహారాలు మానుకుని దేశానికి భద్రత కల్పిస్తున్నారు అంటే సరిపోదు వందకోట్ల జనాభాని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇంతటి భద్రత కల్పిస్తున్న మన సైనికులు, మన రక్షణ బలం గురించి తెలుసుకుంటే గర్వంగా సెల్యూట్ చేయకుండా ఉండలేరు. .జై హింద్ సైనికుల దినోత్సవ శుభాకాంక్షలు.
