పోతుగల్ లో ఘనంగా ముగ్గుల పోటీలు.

నిజామాబాద్ అగ్నిధార న్యూస్ సంక్రాంతి పండుగ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పాలు పొంగించి సంతోషంగా జరుపుకున్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో ప్రజలు పొలలవద్దకు వెళ్లి ఈ వేడుకలు జరుపుకున్నారు.
సంక్రాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గెలుపొందిన వారికి PRTU మండల ప్రెసిడెంట్ సూదం.వెంకటేష్ బహుమతులు అందించారు. ఇందులో మొదటి బహుమతి సూదం పద్మ, రెండవ బహుమతి పులకంటి భాగ్యశ్రీ, మూడవ బహుమతి కుమ్మరి.సుజాత,నాల్గవ బహుమతి గంధపు సాహితికి తదితరులకు బాహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పబ్బ సందీప్, మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.