ఆర్మీ దినోత్సవం సందర్భంగా సైనికులకు సన్మానం.

నిజామాబాద్ అగ్నిధార న్యూస్ భారతీయ ఆర్మీ దినోత్సవం సందర్భంగానిజామాబాద్ జిల్లా  కోటగిరి మండలం పోతంగల్ హైస్కూల్ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఆర్మీలో పని చేస్తున్న సైనికులకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా జవాన్లు యువతకి సందేశం ఇచ్చారు.  పిల్లల యువత చదువుపై దృష్టి పెడుతూ లక్ష్య సాధన అడుగులు వస్తూ దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నారు .మేము మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సెలవులపై వచ్చిన ప్రతిసారి వచ్చిన మీ కావలసిన ప్రోత్సాహాన్ని మేము అందిస్తామన్నారు. అదేవిధంగా  పోతంగల్ గ్రామంలో నేషనల్ హాకీ మరియు కబడ్డీ  ఆడే వాళ్లకి   కిట్లు అందిస్తామన్నారు.సందర్భంగా  యూత్ అధ్యక్షుడు మాట్లాడుతూ సైనికుల దినోత్సవం నాడు సైనికులను సన్మానించడం గొప్ప ఆనందాన్ని ఇస్తుందన్నారు. యావద్దేశం ప్రశాంతంగా ఉంటుంది అంటే జవానుల త్యాగం అన్నారు .ధైర్యంగా ఈ దేశానికి సేవ చేసే అదృష్టం ఒక సైనికులకు మాత్రమే ఉందన్నారు. దేశ సేవ చేసే వాళ్ళే నిజమైన హీరోలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కుల మత ప్రాంతీయ భేదం లేకుండా  దేశానికి కాపాడే మహోన్నత కార్యక్రమమే ఆర్మీ ఉద్యోగం అని తెలిపారు. ఈ సందర్భంగా దేశ సైనికులకు సైనికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.