అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): పెద్దపల్లి మండలం పరిషత్ ఆఫీసులో ,మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక తనిఖీకై పెద్దపల్లి మండలం ఈజీఎస్ సిబ్బంది సన్నద్ధం అవుతుంది. మండలంలోని 30 గ్రామాలలో రెండు సంవత్సరాల తర్వాత ఉపాధి హామీ సామాజిక తనిఖీ కార్యక్రమం రేపటి నుండి (మంగళవారం) జరగబోతుంది. గ్రామాలలో జరిగే సామాజిక తనిఖీకి గతంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ సెక్రెటరీ  రికార్డులు సరి చూశారు. ఈ సామాజిక తనిఖీ రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన తర్వాత జరుగుతున్న సామాజిక తనిఖీ, ఇందులో గతంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో పాల్గొంటారా లేదా అనేది చూడాలి.

అదేవిధంగా రాష్ట్రంలో కరోన విజృంభణ దృశ్య పాఠశాలలు కూడా ఈనెల 30 వరకు సెలవులు ఇచ్చారు. మరి పది రోజుల పాటు పెద్దపల్లి మండలం లో జరిగే సామాజిక తనికి కార్యక్రమం క్షుణ్నంగా చేస్తారా,మమ అనిపిస్తారా అనేది చూడాలి. ఏదేమైనా గ్రామ స్థాయిలో జరిగే ఈ సామాజిక తనిఖీ కార్యక్రమం కోవిడ్ నియమాలను పాటిస్తూ తనిఖీలు చేపడితే పర్వాలేదు  లేదoటే కరోన కాటు తప్పదు.