అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకి పెద్దపల్లి పట్టణంలోని      స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో  ఉన్నత ఆదేశాల మేరకు ఎస్ ఐ మౌనిక ఆధ్వర్యంలో  వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులతో పెండింగ్ చాలన్స్ చెల్లింపు చేయించారు.  ఎస్ ఐ మౌనిక మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరి డ్రైవింగ్ లైసెన్స్, వాహన కాగితాలు, హెల్మెట్, మాస్క్ ధరిస్తూ, సెల్ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, సూచించారు. ప్రతిరోజు వాహనాల తనిఖీ ఉంటుందన్నారు . ప్రతి ఒక్కరు రహదారి భద్రత చర్యలు పాటించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో  కరోన కేసులు  విజృంభిస్తున్న దృశ్య అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ తనిఖీలో  కానిస్టేబుల్ డేవిడ్ బ్లూ కోడ్ సిబ్బందిపాల్గొన్నారు.