మండల పరిషత్ సమావేశ మందిరంలో లో ఘన సన్మానం .          

అగ్నిధార న్యూస్(  పెద్దపల్లి ):జిల్లా పెద్దపల్లి  మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ బండారి స్రవంతి ఆధ్వర్యంలో బదిలీపై వెళ్లిన ఉద్యోగస్తులకు ఘనంగా సన్మానం చేశారు. ఇట్టి సమావేశంలో పెద్దపెల్లి జడ్పిటిసి బండా రామ్మూర్తి ఎంపీడీవో రాజు మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న అటువంటి ఆఫీస్  సూపరింటెండెంట్ సేనారెడ్డి జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ ప్రసాద్ టైపిస్ట్ అక్రమ్ ఆలీ పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ గురువయ్య ఆఫీస్ సబార్డినేట్ వెంకటేష్ లు పెద్దపెల్లి మండల ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజలకి చేసిన సేవలు మరిచిపోలేని అన్నారు . ఉద్యోగస్తులకు బదిలీలు తప్పవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉద్యోగ  ధర్మం పాటిస్తూ ప్రజలందరికీ సేవలు చేయాలన్నారు . ఈ సందర్భంగా మండలంలోని మూల సాల సర్పంచ్ శంకరయ్య బ్రాహ్మణపల్లి సర్పంచ్ మల్లేశం వైస్ ఎంపీపీ రాజయ్య కార్యదర్శులు పి ఏ సి సి చైర్మన్ చంద్రారెడ్డి మామిడి కొమురయ్య పంచాయతీ కార్యదర్శులు బదిలీపై వెళ్తున్న ఉద్యోగస్తులకు ఘనంగా పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ సుదర్శన్ నాగేందర్ ఖాజా అలీ సౌజన్య విజయ్ రవీందర్ మధునమ్మ శ్రావణి శ్వేత ఈజీఎస్ సిబ్బంది ఈ పంచాయతీ ఆపరేటర్ తదితరులు పాల్గొన్నారు.