అగ్నిధారన్యూస్( మంచిర్యాల జిల్లా ): బుధవారం రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో సిపి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. నేర నియంత్రణతో పాటు పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి పోలీస్ అధికారులు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్ అధికారులకు ఆదేశించారు..మంచిర్యాల జోన్ పోలీస్ స్టేషన్ల లో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న కేసులు సత్వర పరిష్కారానికి పోలీసు అధికారులు కృషి చేయాలని, ప్రతి కేసులోని క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను పెంపొందించుకోవాలని అన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ లో 5ఎస్ ఎస్ ఇంప్లిమెంట్ చేయాలి అన్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలి, చెట్లు నాటాలి, ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విశబుల్ పోలీసింగ్ ఉండాలి. బ్లూ కోల్ట్స్ మరియు పెట్రో కార్ నిరంతరాయంగా తిరిగేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిబ్బందికి హెల్త్ చెక్ చేపించాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే లోకల్ డాక్టర్ లతో మాట్లాడి ట్రీట్మెంట్ చేపించాలి అన్నారు. సిబ్బంది కి హెల్త్ క్యాంపు లు నిర్వహించాలి. కేసుల విచారణలో ఎస్ ఓ పి ని పాటించడం ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చూడాలని తెలిపారు. అలాగే కేసులోని వివరాలన్నింటినీ ఆన్లైన్ లో నమోదు చేయాలని ,ఆయా కేసుల రివ్యూ కూడా ఆన్లైన్ లో చూసేవిదంగా అప్డేట్ చేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.నేర నియంత్రణకు, నేర చేదనకు ఎంతగానో ఉపయోగపడే సీసీ కెమెరాల ఆవశ్యకత పై ప్రజలకు అవగాహన కల్పించి వాటిని ఎక్కువ మొత్తంలో ఏర్పాటుకి కృషి చేయాలని, వాటిని యొక్క మెయింటైన్ గురించి రెగ్యులర్ గా చెక్ చేయాలనీ అన్నారు. ప్రభుత్వ నిబంధనలకి వ్యతిరేకంగా అక్రమంగా నిర్వహించే గంజాయి, గుట్కా, గుడుంబా, పేకాట, మట్కా నకిలీ విత్తనాలు సరఫరా, తయారీ మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు, నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల భద్రత కొరకు షీ టీమ్స్, స్పెషల్ టీమ్స్ ద్వారా ముందస్తు సమాచారం సేకరించి ఆకతాయిల ఆగడాలు అరికట్టాలని, నిఘా ఉంచాలని సూచించారు. సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే విధంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి అని తెలిపారు. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తిస్తూ పోలీసుల పై మరింత నమ్మకాన్ని పెంపొందించేలా బాధ్యతగా పనిచేయాలని అన్నారు. అలాగే పిటిషన్ లు పెండింగ్ లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న యుఐ కేసులలో చార్జిషీట్ పెండింగ్ కు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకొని వారికి పలు సూచనలు చేశారు. ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్ నియమాల పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే టౌన్ల లో ట్రాఫిక్ నియంత్రణ గురించి చర్యలు తీసుకోవాలి అని సూచించారు. నిందితుల పై కేసులు నమోదు చేసేటప్పుడు వారి గత నేర చరిత్ర ను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు సివిల్ కేసులలో అధికారులు, సిబ్బంది ఎవరు జోక్యం చేసుకోవద్దని, ఇల్లిగల్ ఆక్టివిటి లను ఎవరు కూడా ప్రోత్సయించరాదని, ఇల్లిగల్ ఆక్టివిటి చేసే వారి పై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులను హెచ్చరించారు. రోజు రోజుకు విస్తృతంగా వ్యాపిస్తున్న ఓమి క్రాన్ వెరియంట్ పట్ల పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పోలీస్ స్టేషన్లలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను పాటించేటట్లు చర్యలను తీసుకోవాలని పాటించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం జరిమానాలు, కేసులు నమోదు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జోన్ ఏసీపీ లు జైపూర్ ఏసీపీ నరేందర్, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్, ట్రాఫిక్ ఏసీపీ బాల రాజు ఏఆర్ ఏసీపీ లు సుందర్ రావు, మల్లికార్జున్, సిసిఆర్ బి ఇన్స్పెక్టర్ కమలాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విద్య సాగర్, ప్రసాద్ రావు,సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ లు ప్రతాప్, నాగరాజు,మంచిర్యాల జోన్ సీఐ లు, ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.
