సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్

సింగరేణి సంస్ధ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రభుత్వం కుట్ర
 బి.జే.పి కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం.   రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ .

అగ్నిధారన్యూస్ ( రామగుండం ): సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి కోప్పుల ఈశ్వర్  కోల్ బెల్ట్ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎంపీలతో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో రామగుండం  ఎమ్మెల్యే, కోరుకంటిచందర్,పాల్గోనిమాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సింగరేణి సంస్థను అమ్మేందుకు కుట్ర చేస్తుందని కేంద్ర ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తమని  ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన సింగరేణి సంస్ద అని లాభాల్లో ఉన్న సింగరేణి ని నష్టాలు చూపించి బి.జే.పీ ప్రభుత్వం 4 బొగ్గు బ్లాకులను వేలం వేస్తుందన్నారు. సి.ఎం కేసీఆర్‌  నేతృత్వంలో సింగరేణి సంస్ధ ఎంతో పురొగతి సాధించిందని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికులతో తాము కలిసి రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.