మండల పరిషత్ కార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తున్న ఎంపీడీవో రామ్మోహన్ చారి
అగ్నిధారన్యూస్( కాల్వ శ్రీరాంపూర్ ):73 వ గణతంత్ర దినోత్సవా వేడుకలు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో తాసిల్దార్ సునీత, ఎంపీడీవో కార్యాలయం పై ఎంపీడీవో రామ్మోహన్ చారి, పోలీస్ స్టేషన్ పై ఎస్సై వెంకటేశ్వర్లు, అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుజాత, సహకార సంఘం చైర్మన్ చదువు రామచంద్ర రెడ్డి, జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.
అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారి కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు ఆ గ్రామ సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, డాక్టర్ ప్రవీణ్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారి నాగర్జున పశు వైద్యులు డాక్టర్ సురేష్ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడుగు రాజ కొమురయ్య పంచాయతీ కార్యదర్శులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ కార్యాలయంలో జెండా వందనం చేస్తున్న తహశీల్దార్ సునీత
