అగ్నిధార న్యూస్( జగిత్యాల ):సంఘం గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ వెంకటేష్ గౌడ్  మరియు గౌడ నాయకులని అక్రమంగా అరెస్ట్ చేసిబంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కుల వృత్తి నిర్వహిస్తున్న గౌడ మహిళను కించపరుస్తూ అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ చిత్రీకరించిన దృశ్యాన్ని తొలగించమని స్టూడియో ముందు ధర్నా చేయడానికి వెళ్లిన మా గౌడ సంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం .ఈ అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ.. వెంటనే విడుదల చేయాలని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు వోల్లాల జలంధర్ గౌడ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.