పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఈటెల

అగ్నిధారన్యూస్ ( హుజురాబాద్ ):మంగళవారం మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్  బిజెపి నాయకులు రామిడి వెంకట్ రెడ్డి  అధ్వర్యంలో జరిగే భారత్ మాత క్రికెట్ ట్రోఫీ -22 బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   ఈ నెల 26వ తేదీన జీడిమెట్ల గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వాహకులచే జరుగుతాయన్నారు .యువత అధిక సంఖ్యలో పాల్గొని శాంతియుత వాతావరణంలో క్రీడలో పాల్గొనాలని విజేతలుగా నిలవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి , బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి  బిజేవైయం దుబ్బాక అసెంబ్లీ కన్వీనర్ మాధవనెని భాను ప్రసాద్, మేడ్చల్ జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షుడు కట్ట కుమార్ తదితరులు పాల్గన్నారు.