అగ్నిధారన్యూస్(  పెద్దపెల్లిజిల్లా ): మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది చే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.      భారత దేశ పౌరుల మైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, మన దేశ సాంప్రదాయాలను, స్వేచ్చాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష , ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా, ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందుములంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము అని ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటు హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం అన్నారు . ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల సంఘం చేసిన సంస్కరణలను వివరించారు. నూతన ఓటరు గుర్తింపు కార్డు పొందాలంటే మీసేవ నెట్ కేంద్రం నుండి దరఖాస్తు చేసుకోవడంతో పాటుగా సాంకేతికత పెంపొందడంతో స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కొత్తగా ఓటు హక్కు నమోదు, చేర్పులు, మార్పులు, సవరణలు అవకాశం ఏర్పడడంతో సేవల్లో పారదర్శకత ఏర్పడిందన్నారు. కొత్తగా ఓటు అర్హత పొంది ఓటర్ గా పేరు నమోదు చేసుకున్న నూతన ఓటర్ లకు ఓటర్ ఐడి కార్డులను అందజేశారు.ఈ ప్రతిజ్ఞలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్ జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి కే.వై. ప్రసాద్, స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ ప్రవీణ్, కార్యాలయ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.