అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ):పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పెద్దపెల్లి  ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని 19,20 వార్డుల్లో నిర్మాణమవుతున్న డ్రైనేజీలు, సిసి రోడ్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, పనుల్లో  నాణ్యత పాటించాలన్నారు. ప్రజా సమస్యలపై అధికారులు ప్రజా ప్రతినిధులు    తమ దిష్టికి వచ్చిన సమస్యలను నమోదు చేసుకొని వెంటనే పరిష్కరించాలన్నారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి కౌన్సిలర్లు బెక్కం అంజమ్మ ప్రశాంత్ తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.