అగ్ని ధారన్యూస్( నస్పూర్ ):నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు గాంధీనగర్ లో బుధవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకుడు భత్తుల వెంకటస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం ద్వారా దేశంలో అందరికీ సమానమైన హక్కు కల్పించాడని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జడ్చర్ల సమ్మయ్య, దాసరి తిరుపతి, ఆర్ల లక్ష్మణ్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
