అగ్నిధారన్యూస్( ఓదెల ):గురువారం రోజు పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో .దళితభవన్ రిజిస్టేషన్ పత్రాలను ప్రత్యేక పూజలు జరిపించి దళిభవన్ ట్రస్టును లాంచ్ చేయడం జరిగింది. ట్రస్ట్ అధ్యక్షులు దాసరి కిషన్ మరియు ఉపాధ్యక్షులు బొంకూరి కైలాసం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడిలేనివిధంగా దళితుల అభివృద్ధికి తొడపాడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలలో దళిత భవనం నిర్మించి దళిత సామాజికవర్గానికి హిందూ దేవుళ్ళను మరింత చేరువ చేయగలరని దళితభన్ ట్రస్ట్ సభ్యులు కోరారు
ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అన్ని కులసంఘాలకు భవనాలు ఉన్నందున దళిత సామాజిక వర్గానికి  కూడా దళితభవన్ నిర్మించి వారి ఆత్మ గౌరవాన్ని పెంపోందించగలరని డిమాండ్ చేశారు.