కోరుకంటి చందర్ ని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందిస్తున్న నల్ల మనోహర్ రెడ్డి

అగ్నిధారన్యూస్ ( రామగుండం ):ఆదివారం రోజు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ అధ్యక్షులు నల్ల మనోహర్ రెడ్డి  తన అనుచరులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే,పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ రథసారధి  కోరుకంటి చందర్ ని క్యాంపు క్యాంపు కార్యాలయంలోకలిసిశాలువాతో,సన్మానించి ,పుష్పగుచ్ఛం అందించి ,శుభాకాంక్షలు తెలిపారు.సందర్భంగా నల్ల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు ముఖ్యమంత్రి  కె చంద్రశేఖర్ రావు యువకుడైన ప్రజా ఆదరణ ఉన్న సమర్థవంతమైన నాయకునికి పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ పగ్గాలు అప్పగించడం ఆనందాన్ని కలిగించింది అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాను అన్నారు . టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి  జిల్లా అధ్యక్షునికి నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు .ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాటకుల అనిల్ నల్ల యువసేన సభ్యులు SK బషీర్ సువర్ణ బిట్టు అలువోజు రవితేజ కొమ్మ సతీష్ యాదవ్ పాల్గొన్నారు..