ఇసుక టెండర్లు రద్దు చేయాలి తాడూరి శ్రీమాన్ డిమాండ్
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):ఆదివారం పెద్దపల్లి లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ తో పాటు గౌరవ అధ్యక్షులు హౌస్ ల ముత్తయ్య ఉపాధ్యక్షులు మేడ గొని శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు. ఇసుక రీచ్ ల ద్వారా బడుగు బలహీన వర్గా లు, హరిజన, గిరిజన వర్గాల ఉపాధి అడుగంటి పోతుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇసుక రీచ్ ల ద్వారా లక్ష 32 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వి పెద్దపెల్లి నియోజకవర్గాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నం చేయడం శోచనీయమని అన్నారు. అనధికారికంగా రెండు లేక మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తరలించేందుకు అధికార పార్టీ కుట్ర పన్నిందని వారన్నారు. ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా అక్రమ మార్గాల ద్వారా టెండర్లకు పిలిచిందని ఆరోపించారు. ఈ విషయంలో లో బడుగు బలహీన వర్గాల పక్షాన జాతీయ హరిత ట్రిబ్యునల్ లో కేసు వేసి ఇసుక రీచ్ లను నిలిపివేయడానికి యత్నిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ చట్టాలను విస్మరించి ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసినట్లు పాలకవర్గాల కుట్రలో భాగంగానే జరిగిందని వారు ఆరోపించారు.
పెద్దపల్లి నియోజకవర్గం లోని పిల్ల కాలువ అయిన మానేరు వాగు లో 19 ఇసుక రీచ్ల ద్వారా ఇసుకను తరలించు క పోవడం ద్వారా త్రాగు,సాగు నీరు కు ఇక్కట్లు ఎదురు కాను ఉన్నాయని అన్నారు. పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి తన బాధ్యతను గుర్తెరిగి వెంటనే టెండర్లను నిలిపివేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రద్దు చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ విషయంలో మౌనం దాల్చితే పెద్దపల్లి నియోజకవర్గం ఎడారిగా మార్చే కుట్రలో అతను కూడా భాగస్థుడు నేనని వారన్నారు. ఇసుక టెండర్లు ప్రభుత్వం రద్దు చేయకపోతే ఉపాధి మరియు భవన నిర్మాణ రంగం నిలిచిపోయి ప్రజలకు ఉపాధి లేకుండా పోతుందని ఎమ్మెల్యే గ్రహించాలని వారన్నారు. ఇసుక టెండర్లు ఒక భారీ కుంభకోణం మని ఇందులో లో రెండు మూడు వేల కోట్లు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్ళను ఉన్నాయని వారన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఇసుక ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ చెందిన 4వేల మంది ట్రాక్టర్ యజమానులు మరో పదివేల మంది పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం దెబ్బతిందని పేర్కొన్నారు .మానేరు నది పై నిర్మాణం చేయనున్న చెక్ డ్యాములు రక్షణకే ఇసుక టెండర్లు పిలుస్తున్నా మని ప్రభుత్వం పేర్కొనడం సిగ్గుచేటైన విషయమని వారన్నారు. రాష్ట్ర ఖనిజ సంస్థ అభివృద్ధి ద్వారా ఇసుక తరలించడం వల్ల స్థానిక అవసరాలకు ఇసుక దొరకక ప్రజలపై అదనంగా లక్షలాది రూపాయల భారం పడనుందని తెలిపారు. ప్రభుత్వానికి 300 కోట్ల ఆదాయంగా చూడవద్దని జిల్లా ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించ లని సూచించారు. ప్రభుత్వం ఇసుక టెండర్ల రద్దును ఉపసంహరించుకోకపోతే జాతీయ హరిత ట్రిబ్యునల్ తోపాటు సుప్రీం కోర్టు ద్వారా కేసులు వేసి పెద్దపల్లి నియోజకవర్గా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను నెరవేర్చే వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాడుతుందని పేర్కొన్నారు.
